సునీల్ ‘కలర్ ఫోటో’ ఫస్ట్ లుక్

211
ramaraju

సునీల్ క‌మెడియ‌న్ గా, హీరోగా ప‌లు చిత్రాలు న‌టించి మెప్పించాడు. తెలుగు సినిమా పుస్త‌కంలో సునీల్ ది ఓ ఛాప్ట‌ర్ వుంది. క‌మెడియన్ గా ఎవ్వ‌రికి ఏ హ‌ని చెయ్య‌లేదు.. హీరోగా ఎవ‌రిని ఎప్పుడూ క‌ష్ట‌పెట్ట‌లేదు. త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో కూడా త‌న‌కున్న‌దాన్ని వెరేవారికి స‌హ‌యం చేశాడే త‌ప్ప కించింత కూడా ఇబ్బంది పెట్ట‌లేదు.. కాని ఒ ద‌ర్శ‌కుడు మాత్రం నా క‌ల‌ర్‌పోటో కి సునిల్ విల‌న్ అంటున్నాడు. అస‌లు క‌ల‌ర్‌ఫోటో ఏంటి.. సునిల్ విల‌న్ ఏంటి..

క‌థ‌లోకి వ‌స్తే..హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ కామెడిల‌తో బ్లాక్ బాస్టర్స్ కొట్టి మైండ్‌బ్లాక్ చేసిన‌ అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో ని లౌఖ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో సంయుక్తంగా నిర్మిస్తున్న విష‌యం ప్రారంభం రోజునే చెప్పాం.. ఆ త‌రువాత అమ‌రావ‌తి ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటుంద‌ని నిర్మాత‌లు సోష‌ల్ మీడియాలో చెప్పుకున్నారు. అయితే అక్క‌డ ఈ మ‌ధ్యే మ‌జిలి, ఏజెంజ్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ‌, ప్ర‌తిరోజుపండ‌గ చిత్రాల్లో క‌మెడియన్ గా క్రేజ్ ని సొంతం చేస‌కున్న‌ సుహాస్ హీరోగా చేస్తున్నాడు.. ఇత‌నికి జోడిగా తెలుగమ్మాయి గా ప‌దిమందికి తెలిసిన చాందిని చౌదరి జోడి గా నటిస్తున్నారు.

యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ మెట్ట‌మెద‌టిసారిగా దర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. సునీల్ మీ మీ క‌ల‌ర్ ఫోటో కి విల‌న్ ఏంటి అంటే మాత్రం అదంతా దియోట‌ర్స్ లో చూడండి ఆయ‌న చేసిన ప‌నేంటో సిల్వ‌ర్ స్క్రీన్ మీద చూడాల్సిందే అంటూ ఇటీవ‌లే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ అందించిన స్వ‌రాల‌తో ఆన్స‌ర్ చెప్ప‌కుండా వెళ్ళిపోయాడు. వీళ్ళంద‌ర్ని పెట్టుకుని 1995 సంవ‌త్స‌రంలో ఒక ఇంజ‌నీరింగ్ కాలేజి లో జ‌రిగిన ప్రేమ‌క‌థ ని సీరియ‌స్ గా తీయ‌టానికి సాయి రాజేస్ నీలం, బెన్నీ ముప్పానేని లు న‌డుం బిగించారు.

వీరికి శ్ర‌వ‌ణ్ కొంక ఆశీర్వాదాలు అందించాడు. వీళ్ళ తోక‌లు క‌త్తిరించే ప‌నిని మాత్రం కోదాటి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అప్ప‌జెప్పారు. వీళ్ళ మ‌ద్య గొడ‌వ‌ల‌కి కార‌ణ ఎ.విజ‌య్ అయితే వాటిని కూడా అందంగా చూపించే ప్ర‌యాత్నాన్ని చేస్తున్నారు వెంక‌ట్ ఆర్ శాఖ‌మూరి.. క‌ల‌ర్ ఫోటో ని అందం గా డెక‌రేట్ చేయ్య‌టానికి క్రాంతి ప్రియం బాద్య‌త‌లు తీసుకుంటే వీళ్ళు ఏ ఫోటో ఇచ్చినా దాన్ని క‌ల‌ర్ ఫోటో గా బ‌య‌ట‌కి చూపించ‌టానికి మాత్రం ఏలూరు శ్రీను తీసుకున్నారు.