“వజ్రకవచధర గోవింద” టీజర్ విడుదల

340
saptagiri-vajrakavachadhara-first-look
- Advertisement -

కమెడియన్ సప్తగిరి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వజ్రకవచధర గోవింద. ఈచిత్రానికి సప్తగిరి ఎక్స్ ప్రెస్ దర్శకుడు అరుణ్ పవార్ దర్వకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లోఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైభవీ జోషీ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈచిత్ర టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. “నేనో వలస పక్షిని .. నాకంటూ ఒక గమ్యం లేదు .. నన్ను వెతుక్కుంటూ ఒక నలుగురు వచ్చారు .. స్నేహితులన్నారు. ఓ అందమైన అమ్మాయి వచ్చింది .. ప్రియురాలు అంది. నేనెప్పుడూ వినని .. వెళ్లని చోటు నుంచి గుంపులు గుంపులుగా వందలమంది వచ్చారు .. శత్రువులమన్నారు. ఇక మేక .. పులి ఆట మొదలైంది. నా ధైర్యం .. నా ఆయుధం .. నా సంకల్ప బలం” అంటూ ఈ వాయిస్ ఓవర్ కొనసాగింది. ఈసినిమాతోనైనా సప్తగిరి విజయం సాధిస్తాడో లేదో చూడాలి మరి.

- Advertisement -