వైసీపీకి షాక్.. బీజేపీ ఆఫీస్ లో అలీ

201
ali

టాలీవుడ్ కమెడీయన్, వైసీపీ నేత అలీ ఢిల్లీ లోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అలీ బీజేపీలో చేరుతారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన అలీకి ఇంత వరకు ముఖ్యమంత్రి జగన్ ఏ పదవి ఇవ్వలేదు. దీంతో అలీ పార్టీ మారుతాడంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీ ఆఫీసుకు వెళ్లడంపై స్పందించారు వైసీపీ నేత అలీ.

తాను వ్యక్తిగతమైన పనిమీద ఢిల్లీ వచ్చానని చెప్పుకొచ్చారు అలీ. త్వరలోనే ఓ హాలీవుడ్ దర్శకుడు ఇండియాకు రాబోతున్నాడని ఆయన ప్రధాని మోదీని కలిసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపాడు. అందుకోసం బీజేపీ ఆఫీసుకు వచ్చినట్లు తెలిపాడు. ఇందుకోసం ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను అలీ కోరారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.