కామెడీ ఎంటర్ టైనర్‌గా “కాక్ టైల్” ప్రారంభం..

304
Cocktail
- Advertisement -

చిత్రలహరి మూవీ మేకర్స్ పతాకంపై జై దర్శకత్వంలో,అట్లూరి మాదవి నిర్మించనున్న హిలెరియస్ కామెడీ ఎంటర్ టైనర్ “కాక్ టైల్”. ఈచిత్ర ప్రారంభోత్సవం ఇటీవల ఫిల్మ్ నగర్ ధైవసన్నిదానంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

Cocktail (1)

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై మాట్లాడుతూ “యువత భవితపై సోషల్ మీడియా ప్రభావం”అనే అంశంతో,అన్నికమర్షియల్ హంగులతో రూపుదిద్దుకొనున్న చిత్రమిది.పాత,కొత్త ఆర్టిస్ట్ లతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఫిబ్రవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్,గోవాలలో జరపనున్నాం. అన్నారు.

ఈ చిత్రానికి కధ,మాటలు:శ్రీకుమార్ దాలిపర్తి సంగీతం:భాను.జె. ప్రసాద్,కేమెరా:శ్రీనివాస్ సబ్బి,డాన్స్:శైలజ, రాక్ వేణు ఫైట్స్:నాబా,ఎడిటింగ్:శివ,సమర్పణ:పవన్ కుమార్ వాసికర్ల,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆనంద్.వి,ప్రొడ్యూసర్:అట్లూరి మాధవి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:జై

- Advertisement -