హోంశాఖ మంత్రిగా ఏక్‌నాథ్‌..ఆర్ధిక మంత్రిగా జయంత్

522
shivsena
- Advertisement -

మహారాష్ట్ర మంత్రిపదవుల పంపకం కొలిక్కివచ్చింది. సీఎం ఉద్దవ్ ఠాక్రే మిత్రపక్షాలకు మంత్రి పదవులను కేటాయించారు. తొలుత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన శివసేనకు చెందిన ఏక్‌నాథ్‌ షిండేకు హోంశాఖ అప్పజెప్పగా కాంగ్రెస్‌కు చెందిన బాలాసాహెబ్ థోరట్‌కు రెవెన్యూ శాఖ,ఎన్సీపీకి చెందిన జయంత్ పాటిల్‌కు ఆర్థిక శాఖను అప్పజెప్పారు. దీంతో పాటు ఎన్సీపీకి చెందిన భుజ్‌బాల్‌కు రూరల్ డెవలప్‌మెంట్,సామాజిక న్యాయం శాఖలను కేటాయించారు.

ఇక ఏక్‌నాథ్‌కు హోంశాఖతో పాటు అర్బన్ డెవలప్‌మెంట్,పర్యావరణం,టూరిజం శాఖలతో పాటు రాష్ట్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖను కేటాయించారు. ఇక జయంత్‌ పాటిల్‌కు ఆర్ధిక శాఖతో పాటు హౌసింగ్‌,ఫుడ్ సప్లై,కార్మిక శాఖలను కేటాయించారు.

శివసేనకు చెందిన సుభాష్ దేశాయ్‌కి పరిశ్రమలు,ఉన్నత విద్య,స్పోర్ట్స్‌,యూత్,ఉపాధి కల్పన శాఖలను కేటాయించగా కాంగ్రెస్‌ నేత నితిన్ రౌత్‌కు ట్రైబల్ డెవలప్‌మెంట్,మహిళా-చైల్డ్ వెల్ఫేర్ శాఖలను కేటాయించారు.

CM Thackeray allocates portfolios.. NCP Gets Finance,shivsena gets Home,congress gets revenue..CM Thackeray allocates portfolios.. NCP Gets Finance

- Advertisement -