టీటీడీ ఛైర్మన్‌గా సీఎం రవిశంకర్‌..!

211
CM Ravishanakar to be TTD Chairman!
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ రేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన వ్యాపారవేత్త సీఎం రవిశంకర్‌ నియమకాన్ని సీఎం చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఇవాళ జరిగే కేబినెట్‌ భేటీలో ఈ మేరకు జీవో జారీ కానున్నట్లు తెలుస్తోంది.
టీటీడీ చైర్మన్ హోదా కోసం చాలా మంది తెలుగుదేశం నేతలు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పదవి విషయంలో బాబుపై వారు ఒత్తిడి చేస్తున్నారు. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, మురళీ మోహన్, జేసీ దివాకర్ రెడ్డి వంటి వారితోపాటు అనేక మంది ప్రముఖులు ఈ పదవి విషయంలో బాబు దగ్గర తమ విన్నపాలను చెప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి.  ఇక నందమూరి హరికృష్ణ‌ కూడా టీటీడీ చైర్మన్ పదవికోసం గట్టిగానే ప్రయత్నం చేసిన  ఎవరికీ పదవిని ఖరారు చేయలేదు ఏపీ సీఎం.

టీటీడీ ఛైర్మన్‌ తనకు దక్కకపోవడంపై హరికృష్ణ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను బుజ్జగించడానికి పార్టీ సీనియర్‌ నేతలను రంగంలోకి దించారు చంద్రబాబు.   రాజ్యసభ స్థానాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం.

19 మందితో కూడిన పాలకమండలిలో బోర్డు సభ్యులుగా సుధా కృష్ణమూర్తి, కోలా ఆనంద్, చింతల రామచంద్రారెడ్డి, రాఘవేంద్రరావు, ఎమ్మెల్యే కొండబాబు, కృష్ణమూర్తి లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ మన్మోహన్ సింగ్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఎండోమెంట్ కమిషనర్ వైవి అనురాధ తదితరులు ఉంటారు. కొత్తగా ఎన్నికయ్యే టీటీడీ ఛైర్మన్… ఏడాది కాలం పాటు పదవిలో కొనసాగనున్నారు.

- Advertisement -