తెలంగాణ భవన్‌కు సీఎం…ముఖ్యనేతలతో భేటీ

202
cm kcr

టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు సీఎం కేసీఆర్‌. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ సభ్యత్వాలు,జిల్లా కార్యాలయ నిర్మాణాలపై చర్చించారు.

దీంతో పాటు మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం,గెలుపు వ్యూహాలను వివరించనున్నారు సీఎం. పార్టీ సభ్యత్వం కోటీ దాటాలని నేతలకు సూచించనున్నారు కేసీఆర్. ఇక ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్‌లో జరిగే కేబినెట్ భేటీలో కొత్త మున్సిపల్‌ చట్టంతో పాటు వివిధ అంశాలకు అమోదం తెలపనుంది కేబినెట్‌.

ఇక రేపు అసెంబ్లీ సమావేశం,19న మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లోనే కొత్త మున్సిపల్ చట్టం తేనున్నారు.