పాలమూరు పనులు వేగవంతం చేయండి: కేసీఆర్

433
cm kcr
- Advertisement -

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోథల పథకం పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు సీఎం కేసీఆర్. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని ఇంజనీర్లు సీఎంకు వివరించారు.

కరివెన రిజర్వాయర్ అన్ని అనుకూలంగా ఉన్నా పనులు ఇంకా పూర్తి కాకపోవడానికి గల కారణాలపై ఆరా తీశారు. నాలుగు నెలల్లో రిజర్వాయర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల చెల్లింపునకు ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అనంతరం సీఎం అక్కడి నుంచి బయల్దేరి నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలానికి బయల్దేరివెళ్లారు. అక్కడ వట్టెం జలాశయం పనులను పరిశీలించనున్నారు.

అనంతరం నార్లాపూర్ వద్ద శ్రీశైలం బ్యాక్‌వాటర్ ప్రాంతంలో పాలమూరు- రంగారెడ్డికి నీటిని ఎత్తిపోసే కోతిగుండు ప్రాంతం, రిజర్వాయర్ పనులను పరిశీలిస్తారు. ఆయా రిజర్వాయర్లకు సంబంధించిన పనులపై సీఎం.. అధికారులతో ఎక్కడికక్కడే సమీక్షలు నిర్వహిస్తారు. సీఎం వెంట మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.

- Advertisement -