కన్నెపల్లి,మేడిగడ్డ పంప్‌హౌస్ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

74
kcr medigadda

కాళేశ్వరం పర్యటనలో భాగంగా కన్నెపల్లి,మేడిగడ్డ పంప్‌హౌస్ పనులను పరిశీలించారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం టెంపుల్‌ దర్శనం అనంతరం నేరుగా కన్నెపల్లి చేరుకున్న సీఎం పంప్‌హౌస్ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన పనులు కూడా త్వరగా చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మేడిగడ్డ పంప్‌ హౌస్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక ముందు జరగాల్సిన ప్రాజెక్టు పనులపై అధికారులు, ఇంజినీర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

మధ్యాహ్నం 1.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించనున్నారు. అనంతరం బ్యారేజ్ ,గేట్ల బిగింపు, కరకట్టల నిర్మాణం, రివీట్‌మెంటు పనుల పురోగతిపై ఆయన సాగునీటి శాఖ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించనున్నారు.