తమిళనాడులో సీఎం కేసీఆర్.. కలాంకు నివాళి

485
abdul kalam
- Advertisement -

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేరళ టూర్ ముగించుకుని తమిళనాడులో పర్యటిస్తున్నారు సీఎం కేసీఆర్. రామేశ్వరంలోని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సమాధి దగ్గరకు వెళ్లిన ఆయన నివాళులు అర్పించారు. కలాం సేవలను గుర్తుచేసుకున్నారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు.

ఈ నెల 10న మధుర మీనాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇక 11న శ్రీరంగం వెళతారు. 13న డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ కావాల్సి ఉండగా ఎన్నికల ప్రచారంలో ఆయన బిజీగా ఉండటంతో వీరి భేటీ రద్దైనట్లు తెలుస్తోంది.

abdul kalam

దేశంలో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న కేసీఆర్.. ఫెడరల్‌ ఫ్రంట్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్రాల పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా కేరళ సీఎం పినరయి విజయన్‌తో భేటీ అయ్యారు. కర్నాటక పర్యటనలో భాగంగా సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు.

- Advertisement -