కాళేశ్వరంకు సీఎం కేసీఆర్

279
cm kcr to visits kaleshwaram
- Advertisement -

భూపాపల్లి జయశంకర్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం కేసీఆర్. రెండు రోజుల పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 6.40 గంటలకు మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంపుహౌజ్ వద్దకు చేరుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన సమీపంలోని కాళేశ్వరం ఆలయం సందర్శిస్తారు.

ఉదయం 6.50 గంటలకు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. తిరిగి కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని ఉదయం 7.25 గంటలకు హెలికాప్టర్‌లో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌ని సందర్శించనున్నారు.

ఉదయం 7.45 గంటలకు ఇక్కడికి చేరుకునే సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1.30 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించనున్నారు. బ్యారేజ్ , గేట్ల బిగింపు, కరకట్టల నిర్మాణం, రివీట్‌మెంటు పనుల పురోగతిపై ఆయన సాగునీటి శాఖ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహిస్తారు.

 సీఎం కేసీఆర్ పర్యటించే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాంతాలు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులో ఉండటం వల్ల పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఇంటెలిజెన్సీ ఐజీ నవీన్‌చంద్ కాళేశ్వరం చేరుకుని సెక్యూరిటీపై పోలీసు అధికారులతో చర్చించారు.

- Advertisement -