రేపు కాళేశ్వరకు సీఎం కేసీఆర్

303
Kcr Kaleshwaram
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4న కాళేశ్వరం ప్రాజెక్ట్ ను సందర్శించనున్నారు. రేపు ఉదయం బేగంపేటలోని విమానాశ్రయంలో ప్రత్యేక హెలికాప్టర్ లో కాళేశ్వరంకు చేరుకోనున్నారు. మొదటగా రాంపూర్ చేరుకుని అక్కడ జరుగుతున్న పంపుహౌస్ పనులను పరిశీలిస్తారు. ఆ తరువాత మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి అక్కడ జరిగే పనులను పరిశీలిస్తారు. పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడుతారు. అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకొనున్నారు.

- Advertisement -