తన గురువు ఇంటికి వెళ్లిన సీఎం కేసీఆర్‌..!

66
kcr news

ఈరోజు తన స్వగ్రామంలో పర్యటించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. సిద్దిపేటలోని చింతమడకకు చేరుకున్న ఆయన తొలుత గ్రామంలోని శివాలయం, రామాలయం, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గ్రామ ప్రజలు, చిన్ననాటి స్నేహితులను ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలుకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామస్తులపై వరాల జల్లు కురిపించారు.

kcr in chinthamadaka

అనంతరం గ్రామంలో కావేరి సీడ్స్ నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని కేసిఆర్ ప్రారంభించి పాఠశాలలో మొక్కను నాటారు. అలాగే నిర్మాణంలో ఉన్న రామాలయం పనులను కూడా ముఖ్యమంత్రి పరిశలించారు. తర్వాత అక్కడి నుండి తన గురువు రాఘవరెడ్డి ఇంటిని సందర్శించి.. రాఘవరెడ్డి భార్య మంగమ్మ, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు సీఎం కేసీఆర్‌. వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారం చూపారు.