13న స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ…

353
stalin
- Advertisement -

మరికొద్దిరోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరోసారి ఫెడరల్ టూర్‌కు శ్రీకారం చుట్టారు. ఇవాళ కేరళ వెళ్లనున్న కేసీఆర్..ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో భేటీ కానున్నారు. సిద్ధాంతపరంగా బీజేపీ, కాంగ్రెస్‌లకు సమాన దూరం పాటిస్తోన్న వామపక్షాలు తమతో కలిస్తే కూటమి మరింత బలంగా మారుతుందనే భావనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కేరళ టూర్‌లో భాగంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో పాటు రామేశ్వరం,శ్రీరంగం దేవాలయాలను సందర్శించనున్నారు కేసీఆర్.

ఇక ఈ నెల 13న తమిళనాడులో పర్యటించనున్న సీఎం…డీఎంకే నేత స్టాలిన్‌తో భేటీ అవుతారు. సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ భేటీలో దేశ రాజకీయాలపై చర్చించనున్నారు. అనంతరం కర్నాటకు కూడా సీఎం కేసీఆర్ వెళ్లనున్నట్లు సమాచారం.

కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కొంతకాలంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గతేడాది ఒడిశా, పశ్చిమ్ బెంగాల్చకర్నాటక సీఎంలతో పాటు ఎస్పీ, బీఎస్పీ నేతలతోనూ ఆయన భేటీ అయ్యారు. అయితే, కొద్ది రోజులు ఆ ప్రయత్నాలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు. తాజాగా ఫ్రంట్ ఏర్పాటుపై కేసీఆర్‌ మళ్లీ దృష్టి సారించారు.

- Advertisement -