ఎంజీబీఎస్‌- జేబీఎస్‌ మెట్రో లైన్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

357
cm kcr
- Advertisement -

ఎంజీబీఎస్‌- జేబీఎస్‌ మెట్రో లైన్‌ను ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారైంది. ఈనెల 7న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మెట్రో లైన్ ను ప్రారంభించనున్నారు. ఇప్పటికే నిర్మాణం, ట్రయల్‌ రన్‌ పూర్తి చేసుకుని మెట్రోరైలు భద్రతా శాఖ నుంచి 20 రోజుల క్రితమే అనుమతులు పొందింది. దీంతో హైదరాబాద్ లో మెట్రో మార్గం మొత్తం 67కి.మీటర్లకు చేరిందన్నారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

ఎంజీబీఎస్‌- జేబీఎస్‌ మధ్య 11కి.మీటర్ల మేర మెట్రో రైలు మార్గం. మెట్రో ద్వారా కేవలం 16 నియుషాల్లోనే ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్ ను ప్రయాణం చేయవచ్చు. . ఇక ఎంజీబీఎస్‌ నుంచి జేబీఎస్‌ కు 9 స్టేషన్లను ఏర్పాటు చేశారు. 2017నవంబర్ లో మియాపూర్ – నాగోల్ మెట్రో రైలు సేవలు ప్రారంభం అయ్యాయి. 2018 సెప్టెంబర్ లో అమీర్ పేట్ -ఎల్బీ నగర్ మధ్య మెట్రో సేవలను ప్రారంభించారు. అలాగే 2019మార్చిలో అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు ఈసేవలు ప్రారంభం అయ్యాయి.

- Advertisement -