సీఎం కేసీఆర్ కలలహారం..హరిత మాలాధారుడై

177
cm Kcr Haritha Haram

మొలక మురుస్తున్నది
సంతన్న చిరునవ్వులా
మాను మేను చిగురిస్తున్నది
తన బిడ్డను తిరిగి చేరుకున్న అమ్మ మోములా

సీఎం కేసీఆర్ కలలహారం
హరిత మాలాధారుడై
సంతన్న పడుతున్న హరిత హారతి
వసంతపు వెలుగులను పంచుతూ
కాంక్రీటు జంగల్ లకు
ఆకుపచ్చని సోయి పెంచుతున్నది

చెట్టును కూల్చేసి
స్వచ్చతను పీల్చేసి
దావానలమై దహిస్తున్న మనిషి స్వార్థానికి
గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నది

చిరునవ్వుల చేతులతో
ప్రగతి భవన్ లో నాటుకున్న వో మొలక
ఇంతింతై వటవ్రుక్షమై
ప్రగతి పథాన విశ్వాంతరాన విస్తరిస్తోంది

అనాది చుట్టమైన అమ్మ చెట్టుకు
పునాది లేకుండా చేస్తూ
ప్రక్రుతిని చెరబడుతూ
విక్రుతంగా మారుతున్న మనిషికి
మాను’వత్వం నేర్పుతున్నది… గ్రీన్ ఛాలెంజ్

పంటి పుల్లయి
మింటికిల్లయి
కంటి చలువై
వంటి బలమై

ఆమ్మా’ అనే
అరుపువినగానే
ఆకు పసరై
మందు గోలై

ఎండకు చెత్తిరై
వానకు గుడిసై
అరకకు నాగలై
ఆకలికి అన్నమై

సర్వమై

తలుపై కొలుపై
కులవేల్పయి
వాయువై ఆయువై
సర్వాంతర్యామియైన

పచ్చని చెట్టు పరిరక్షణకు…

గ్రీన్ ఛాలెంజ్ విసురుతూ
వనాలు విడిచిన జన జీవితాల్లో
వసంతాలు మోసుకొచ్చేందుకు
ఆకుపచ్చని ధీక్షపట్టిన
వసంతన్నకు
వన సంతన్నకు
మనసంతా నిండిన
మనసంతన్నకు
హరితారిత వందనాలు

జై తెలంగాణ
జయహో కేసీఆర్