దళితవాడల నుంచే పట్టణ ప్రగతిః సీఎం కేసీఆర్

351
kcr
- Advertisement -

పల్లె ప్రగతి పునాదిగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్వహించే పాదయాత్రలు, చేపట్టే కార్యక్రమాలు పేదలు ఎక్కువగా ఉండే దళితవాడల నుంచే ప్రారంభించాలని సిఎం కోరారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై దృష్టి పెట్టాలని కోరారు. వార్డుల వారీగా పట్టణ ప్రగతి ప్రణాళిక తయారు చేసుకుని దానికి అనుగుణంగా పనులు చేసుకుంటూ పోవాలని చెప్పారు. మూడు నెలల్లో అన్ని పట్టణాలు, నగరాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం పూర్తి చేయాలని, ఎనిమిది నెలల్లో కరెంటు సంబంధింత సమస్యలన్నీ పరిష్కారం కావాలని, లేని పక్షంలో సంబంధింత ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుందని సిఎం హెచ్చరించారు.

నిధుల వినియోగంలో ఖచ్చితమైన క్రమశిక్షన పాటించాలని, ప్రణాళిక ప్రకారమే వ్యయం చేయాలని కోరారు. పల్లెప్రగతి కార్యక్రమం సమీక్షించడానికి మండల పంచాయతీ అధికారులు గ్రామాల్లో పర్యటించాల్సి ఉన్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు తమ పరిధిలోని గ్రామాల్లో రాత్రి భస చేసి, గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి, పల్లె ప్రగతి లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 4 వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా చేయాల్సిన పనులపై చర్చించేందుకు మంగళవారం ప్రగతి భవన్ లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మున్సిపల్ సదస్సులో సిఎం మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చేయాల్సిన కార్యక్రమాలను సిఎం దిశానిర్దేశం చేశారు.

- Advertisement -