చింతమడకలో సీఎం…బాల్య స్నేహితులతో ముచ్చట్లు

339
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకకు చేరుకున్నారు. కాసేపటి క్రితం చింతమడక చేరుకున్న సీఎం గ్రామస్తులతో కరచాలనం చేసి ఆప్యాయంగా పలకరించారు.బాల్య స్నేహితులతో ముచ్చటించారు. చింతమడక అభివృద్ధిలో భాగంగా గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశం కానున్న సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. గ్రామస్తులతో సహపంక్తి భోజనాలు,డబుల్ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవం,బీసీ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేయనున్నారు.

3200 మంది గ్రామస్థులకు ప్రత్యేకంగా తయారుచేయించిన పింక్ కలర్ ఐడీ కార్డులను అందించారు. వీరంతా ఐడీ కార్డులతో సభాస్థలికి చేరుకుంటారు. ప్రతి 30 కుటుంబాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. 200 మంది అధికారులకు వైట్ గుర్తింపుకార్డులు, 200 మంది మీడియా ప్రతినిధులకు గ్రీన్ గుర్తింపుకార్డులను అందించారు. మొత్తంగా ఆరువేల మందికి భోజనాలను ఏర్పాటుచేస్తున్నారు.

సీఎం కేసీఆర్ ఆత్మీయులతో కలిసి భోజనం చేయడానికి పెద్దమ్మ గుడి పక్కనే రెయిన్‌ప్రూఫ్ టెంట్ వేశారు. పెద్దమ్మ గుడి ముందు చింతచెట్టు వద్ద గద్దెను కూడా నిర్మించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

- Advertisement -