నేడు హుజుర్ నగర్ లో సీఎం కేసీఆర్ కృతజ్నత సభ 

331
Cm kcr
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు హుజుర్ నగర్ కు వెళ్లనున్నారు. తాజా ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పట్టణంలో ఏర్పాటుచేసిన ప్రజాకృతజ్ఞత సభలో ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తయ్యాయి.  ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంద్వారా హుజూర్‌నగర్‌కు చేరుకుంటారు.  అక్కడ త్రివేణి ఫంక్షన్ హల్ లో హుజుర్నగర్ ఎన్నికలో భాద్యులుగా పని చేసిన నేతలతో, జిల్లా mla లతో  నాయకులతో భోజనం చేస్తారు….అక్కడి నుంచి కోదాడ మీదుగా హుజుర్నగర్ సభ స్థలికి చేరుకుంటారు

హుజూర్‌నగర్ సభకు వస్తున్న సీఎం కేసీఆర్‌ను చూడటానికి, ఆయన మాటలను వినడానికి లక్షమందికిపైగా ప్రజలు తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో సీఎం సభ రద్దయినా భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజలను కలవాలని తాము సీఎంను అడిగామని, అందుకు ఆయన వెంటనే అంగీకరించారని చెప్పారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజాకృతజ్ఞత సభకు హుజూర్‌నగర్ నియోజకవర్గ ప్రజలతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సభలో హుజూర్‌నగర్ అభివృద్ధికోసం రోడ్‌మ్యాప్‌ను సీఎం ప్రకటించే అవకాశం ఉన్నదని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.

- Advertisement -