లాక్‌డౌన్.. సీఎం కేసీఆర్‌ అత్యవసర సమావేశం..

234
cm kcr

స్టేట్ లాక్ డౌన్ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రాష్ట్ర స్థాయి అత్యున్నత, అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. ఈ మద్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో జరిగే సమావేశంలో వైద్య ఆరోగ్య, పోలీస్, రెవెన్యూ, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఆర్థిక తదితర శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి తదితరులు పాల్గొంటారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడతారు.