మేడిగడ్డలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక హోమం..

103
cm kcr homam

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా మేడిగడ్డలో నిర్వహిస్తున్న ప్రత్యేక హోమంలో సతీసమేతంగా పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డ చేరుకున్న సీఎం శారదపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న హోమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ కాలంలోనే అనితర సాధ్యమైన స్వప్నాన్ని సాకారం చేసుకొని మన జాతికి కాళేశ్వరం ప్రాజెక్టును సమర్పణం చేస్తున్న అద్భుతఘట్టం మరికొన్ని గంటల్లోనే సాక్షాత్కరించనున్నది. ఉదయం 10.30 గంటల సమయంలో గవర్నర్, ఏపీ,మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమక్షంలో నీటిని విడుదల చేయనున్నారు సీఎం కేసీఆర్ . .

కాళేశ్వరం ప్రారంభానికి గోదావరితీరం అన్నిరకాలుగా ముస్తాబైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌజ్ వద్ద మహా ఘట్టానికి సన్నాహాలు పూర్తయ్యాయి.