విద్యుత్ విషయంలో అగ్రగామిగా ఉన్నాం-కేసీఆర్‌

193
kcr on power

‘భారతదేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలో మనమెంతో మెరుగ్గా ఉన్నామని.. రాష్ట్రం ఏర్పడిన నాడు అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ విషయంలో నేడు అగ్రగామిగా ఉన్నామన్నారు.

ట్రాన్స్ కో సిఎండి ప్రభాకర్ రావు, డిస్కమ్ ల సిఎండిలు రఘుమారెడ్డి, గోపాలరావు, విద్యుత్ సిబ్బంది ఎంతో కష్టపడి విద్యుత్ రంగాన్ని తీర్చిదిద్దారు. అదే స్పూర్తితో వారు గ్రామాల్లో ఉండే విద్యుత్ సమస్యలన్నీ పరిష్కరించడానికి ముందుకు వస్తున్నారు’’ అని సిఎం కేసీఆర్ అన్నారు.