నేడు ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ భేటీ..

532
kcr
- Advertisement -

ఆర్టీసీ కార్మికులతో రోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. డిపోకు ఐదుగురు చొప్పున ప్రతి డిపో నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు హాజరుకానున్నారు. మధ్యా హ్నం ఒంటిగంటకు ఈ సమావేశం ప్రారంభంకానుండటంతో 12 గంటల్లోగానే సిబ్బంది ప్రగతిభవన్‌లోకి వచ్చేలా అధికారులు శనివారం సాయంత్రం నుంచే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

యూనియన్ నేతల మాటలు పట్టుకోని సమ్మెకు దిగిన కార్మికులు దాదాపు రెండునెల్ల పాటు సమ్మెలో పాల్గొని ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్న నేపథ్యంలో సిఎం కేసీఆర్ మానవతా ద్రుక్పథంతో స్పందించి వారిని బేషరతుగా ఉద్యోగ అవకాశాన్ని తిరిగి కల్పించారు. కాగా.. ఆర్టీసీ సంస్థను బలోపేతం చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తున్న కార్మికులను తానే స్వయంగా పిలిపించుకుని వారి సాధకబాధకాలు తెలుసుకోగోరిన ముఖ్యమంత్రి ఆదివారం నాడు రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల నుంచి ఐదుగురు చొప్పున కార్మికులను పిలిపించుకుని ఆత్మీయ సంభాషణ చేయనున్నారు. ఈ సందర్బంగా ఆర్టీసీ సంస్థ మంచి చెడుల గురించి, సంస్థను మరింత పటిష్టపరిచి అభివృద్ధి చేసుకోవాలంటే చేపట్టాల్సిన కార్యాచరణను వారితో చర్చించనున్నారు.

ఇన్నాల్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికుల క్షేత్రాస్థాయి అనుభవాలను పంచుకోవడం ద్వారా ఆర్టీసీని మరింత బలోపేతం చేసి, నాణ్యమైన ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దేందుకు చేపట్టనున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం నాడు జరగనున్న ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో సమగ్రంగా ఎటువంటి చర్చ చేయాలె…కార్మికులు సంస్థ అధికారులనుంచి ప్రభుత్వం నుంచి ఆశించే అంశాలు ఏమిటి.. అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ దీర్ఘకాలిక చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి శనివారం ప్రగతి భవన్ లో సుధీర్ఘ సమావేశం జరిపారు. ఈ సమీక్షాసమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ, ఇ.డిలు తదితర ఉన్నతాధికారులు, సిఎంవో అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -