మహారాష్ట్ర గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్‌..

71
CM KCR

మహారాష్ట్ర పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముంబయి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆ రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు స్వాగతం పలికారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన సీఎం కేసీఆర్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు.

ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆహ్వానించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌తో సమావేశమవుతారు.

CM KCR