ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ క్వార్టర్స్‌ ప్రారంభం

369
cm kcr
- Advertisement -

శాసనసభ, శాసనమండలి సభ్యుల కోసం హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో నిర్మించిన నివాస సముదాయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ నివాస సముదాయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంకు మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఘన స్వాగతం పలికారు. మంత్రులతో కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ ను పరిశీలించారు సీఎం కేసీఆర్.

120 మంది చట్టసభల ప్రజాప్రతినిధులు నివాసం ఉండేలా 4.26 ఎకరాల స్థలంలో రూ.166 కోట్లతో నిర్మాణం చేపట్టారు. ఒక్కో ఫ్లోర్‌లో పదిచొప్పున 12 అంతస్తుల్లో 120 క్వార్టర్స్‌ను నిర్మించారు. ఒక్కో సభ్యుడికి రెండుకార్లకు అవసరమైన పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 23 సమావేశ క్యాబిన్లను కూడా ఏర్పాటుచేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను కలువడానికి వీలుగా వీటిని నిర్మించారు.

ఒక్కోక్వార్టర్‌ను మూడు బెడ్‌రూంలతో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంతో.. మొత్తం 6 లక్షల చదరపు అడుగుల నిర్మాణం చేపట్టారు. వీటికి అనుబంధంగా 325 చదరపు అడుగుల చొప్పున 120 సర్వెంట్ క్వార్టర్స్‌ను, సిబ్బందికి 36 క్వార్టర్స్ ఉన్నాయి.

- Advertisement -