నరసింహన్‌కు ఘనంగా వీడ్కోలు..

188
governer

గవర్నర్‌ నరసింహన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా వీడ్కోలు పలికింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా, అనంతరం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా మొత్తం 9 ఏళ్ల 9 నెలల పాటు కొనసాగిన నరసింహన్ ప్రస్థానం ముగిసింది.

governer

నేటితో ఆయన పదవీకాలం ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి భవన్‌లో ఆయనను ఘనంగా సన్మానించింది. కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తన సొంత నగరమైన చెన్నైకు ఆయన బయల్దేరారు.

ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో పోలీసుల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. అనంతరం నరసింహన్‌కు సీఎం కేసీఆర్‌, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు తదితరులు వీడ్కోలు పలికారు.. కాగా, తెలంగాణ గవర్నర్ గా రేపు తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.