తెలంగాణ ఆర్థిక ప్రగతి భేష్: సీఎం కేసీఆర్

568
cm kcr
- Advertisement -

తెలంగాణ ఆర్థిక ప్రగతి భేష్ అని తెలిపారు సీఎం కేసీఆర్. 73వ స్వాతంత్య్ర  దినోత్సవ వేడుకల్లో భాగంగా గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు.

తెలంగాణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన సీఎం కేసీఆర్…పోరాడి సాధించుకున్న తెలంగాణ కలలు సాకారమవుతున్నాయని చెప్పారు. పటిష్ట కార్యాచరణ,అవినీతికి తావులేని పాలనతో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఎదిగిందన్నారు. 14.8 వృద్ధిరేటుతో తెలంగాణ ముందువరుసలో ఉందన్నారు.

ఐదేళ్లలో రాష్ట్ర సంపద రెట్టింపు అయిందని చెప్పారు సీఎం కేసీఆర్. ఆదర్శవంతమైన పాలనతో దేశం దృష్టిని ఆకర్షించ గలిగామని చెప్పారు.గడిచిన ఐదేళ్లలో పటిష్టమైన అడుగులు పడ్డాయని ఇప్పుడు సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. పేద ప్రజలను ఆదుకోవాలనే సంకల్పంతో సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పారు.

సుపరిపాలన..అవినీతిని అంతమొందించడం కోసం చట్ట పరమైన సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. గతంలో 10 జిల్లాలుగా ఉన్న తెలంగాణను 33 జిల్లాలుగా ఏర్పాటుచేసుకున్నామని చెప్పారు. కొత్తగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.

ఉద్యోగ అవకాశాలు స్ధానికులకే దక్కాలనే దృక్పథంతో జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే తెలంగాణలో ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. పాత చట్టాలను సమూలంగా మార్చి కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. త్వరలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. 60 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ప్రతి ఒక్కరు గ్రామాల్లోని చెత్తను తొలగించేందుకు నడుం బిగించాలన్నారు.

- Advertisement -