బోటు ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి..

317
kcr

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో పాపికొండల వద్ద లాంచీ ప్రమాదం జరగడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మృతుల్లో తెలంగాణ వాసులు కూడా ఉండటంతో అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. హుటాహుటిన వెళ్లి మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, అంత్య క్రియలు, ఇతరత్రా కార్యక్రమాలలోనూ పాల్గొనాలని సీఎం కేసీఆర్ మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ను కోరారు.

అలాగే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి తక్షణం బోటు ప్రమాద ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి రాజమండ్రి బయలుదేరారు. ఆయన గల్లంతైన తెలంగాణ వాసులకు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షంచనున్నారు.