ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం కేసీఆర్ అభినందనలు..

256
cm kcr
- Advertisement -

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహం 5 రోజుల తర్వాత భూ నియంత్రత కక్ష్యలోకి చంద్రయాన్‌ 2 ప్రవేశిస్తుంది. సగటును 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనుంది.

చంద్రయాన్2 ప్రయోగం విజయవంతంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. శాస్త్రవేత్తల కఠోర శ్రమను, ప్రతిభా పాటవాలను ముఖ్యమంత్రి కొనియాడారు. అలాగే ఈ ప్రయోగం విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఇస్రో శాస్త్రవేత్తలందరికి అభినందనలు తెలిపారు.

- Advertisement -