క్రీడా శాఖ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు..

282
Sports Authority
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ క్రీడా శాఖ ఆధ్వర్యంలో పలు క్రీడా,సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బ్లెడ్ డోనేషన్ కాంప్,వికలాంగులకు వీల్ చైర్స్ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 17న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు స్పోర్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తెలిపారు.

CM KCR Birthday

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మొదటగా మొక్కల నాటడంతో ప్రోగ్రామ్స్ కొనసాగుతాయి. ప్రతి క్రీడాకారుడితో ఎల్బీ స్టేడియం చుట్టూరా మొక్కలు నాటుతాము. 17న కేసీఆర్ జన్మదినం సందర్భాగ T-10 క్రికెట్ టోర్నమెంట్ పలు టీమ్ లతో కొనసాగుతుంది. అలాగే పలు స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు అని తెలిపారు.

కేసీఆర్ జన్మాదినం సందర్బంగా 80మంది క్రీడాకారులకు సన్మానంతో పాటు బహుమతులు ప్రధానం చేస్తామన్నారు. T-10 క్రికెట్ టోర్నమెంట్‌లో ఎన్జీఓస్,మీడియా,సినీ ఆక్టర్స్,పోలీస్ టీమ్,ఎమ్మెల్యేల టీమ్,సిఐఐ టీమ్‌లు పాల్గొననున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు,మినిస్టర్స్, రాజకీయ నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు,పోలీస్ ఉన్నత అధికారులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పలు మీడియా సంస్థలు పాల్గొననున్నారని వెంకట్ రెడ్డి తెలిపారు.

- Advertisement -