నాగోల్‌లో క్రిస్టియన్ భవన్‌..

246
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ శోభ సంతరించుకుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలంగాణలో క్రైస్తవులకు ప్రభుత్వం అన్నిరకాలుగా చేయూత అందిస్తుందని సీఎం అన్నారు. క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా కేసీఆర్‌.. పేద క్రైస్తవ సోదరులకు దుస్తులు పంపిణీ చేశారు.

రాష్ట్రంలోని అన్ని కులాల, మతాల, వర్గాల ప్రజలు సందర్భోచితంగా గౌరవించబడి అభివృద్ధి ఫలాలు పొందగలిగితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని అన్నారు. దేశమంతా గర్వించే విధంగా క్రిస్టియన్ భవన్‌ను కట్టాలని భావించామని, అయితే కొన్ని అడ్డుంకుల వల్ల అది సాధ్యపడలేదన్నారు. నాగోల్‌కు సమీపంలో క్రిస్టియన్ భవన్‌కు స్థలం కేటాయించి పండుగకు ముందే అనుమతులిస్తామని సీఎం స్పష్టం చేశారు.

CM KCR At Christmas Celebrations

ఏసుక్రీస్తు త్యాగం అందరికీ మార్గదర్శకం. రెండున్నర ఏండ్లలో మీ అందరి దీవెనలతో ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. గతంలో క్రైస్తవులపై పలుచోట్ల దాడులు జరిగాయని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రస్తుతం అలాంటి సంఘటనలు లేవని, పరిస్థితుల్లో మార్పు వచ్చిందని తెలిపారు. అక్కడక్కడా అలాంటి ఘర్షణలు జరిగే పరిస్థితి తలెత్తినా దానిని ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు.

CM KCR At Christmas Celebrations

ఈ నెల 25న క్రిస్మస్ పండుగ, 26న బాక్సింగ్ డే ఉంటుంది. 30వ తేదీకి అసెంబ్లీ పూర్తవుతుంది. ఆ వెంటనే బిషప్‌లందరినీ నా ఇంటికి భోజనానికి పిలపించుకుంటా.. అన్ని సమస్యలపై చర్చించుకుందాం. వాటి పరిష్కార మార్గాలు ఆలోచించుకుందామని తెలిపారు.

- Advertisement -