యుగంధర్‌ మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌

165
Microsoft-CEO-Satya-Nadendla-Father-Died

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి యుగంధర్‌ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం తెలిపారు. సమైక్య రాష్ట్రంలో యుగంధర్‌ అందించిన సేవలను ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తుచేసుకున్నారు. యుగంధర్‌ నిజాయితీ, నిరాడంబరతను కేసీఆర్‌ కొనియాడారు. యుగంధర్‌ కుటుంబసభ్యులకు, ఆయన తనయుడు, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు సీఎం సానుభూతి ప్రకటించారు.

మరోవైపు యుగంధర్ మృతి పట్ల తీవ్ర సంతాపం పరిశ్రమల మరియు ఐటి శాఖ మంత్రి కెటి రామారావు వ్యక్తం చేశారు. దేశంలో అనేక గ్రామీణ అభివృద్ధి సంస్కరణల కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.యుగంధర్ గారి కుమారుడు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.