కేసీఆర్‌కు ఉప ప్రధాని ఆఫర్..!

219
- Advertisement -

కేంద్రంలో బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడాలంటే ఉత్తరాది పార్టీల బలం ఎంత ముఖ్యమో, దక్షిణాది పార్టీల బలం కూడా అంతే ముఖ్యం .ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషిస్తారని అంచనా. ఈ నేపథ్యంలో ఒక కూటమి నుంచి కేసీఆర్ కు ఉపప్రధాని ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.. అందుకు మిగతా పక్షాల సమ్మతి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ కూటమిలో నాయకత్వ సమస్య ఉంది… ప్రధానమంత్రి అభ్యర్థి విషయంలో ఆ పదవికి ఏడుగురు పోటీ పడుతున్నారు..ఈ నేపథ్యంలో కేసీఆర్ కూడా పోటీ పడితే ఇబ్బంది అనుకున్న కాంగ్రెస్ కూటమిలోని కొందరు నేతలు కేసీఆర్ కు ఉప ప్రధాని పదవి ఆపర్ చేసినట్లు తెలుస్తోంది.

KCR

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో డీఎంకే, వైఎస్సార్సీపీ టీడీపీ, టీఆర్‌ఎస్‌లకు 60 స్థానాలకు పైగా వస్తే ఈ నాలుగు పార్టీల బలం కీలకం అవుతుంది. బీజేపీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్‌ సహకరిస్తే ఆయన ఉప ప్రధాని కావడానికి చంద్రబాబుకు అభ్యంతరం ఉండదట.

ప్రస్తుతానికి ఈ ఇరువురి మధ్య సంబంధాలు ఉప్పు–నిప్పుగా ఉన్నప్పటికీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్మోహన్‌రెడ్డికి ఆశించిన సీట్లు లభించని పక్షంలో కేసీఆర్‌ తన వైఖరి మార్చుకుని చంద్రబాబుతో చేతులు కలపడానికి సిద్ధపడతారని.. లేదా జగన్, కేసీఆర్, చంద్రబాబు కలిసే జాతీయ రాజకీయాలు నడుపుతారనే అంచనాలు వెల్లువెత్తున్నాయి.. ఇంతకీ కేసీఆర్ ఉప ప్రధాని పోస్టుతో సరిపెట్టుకంటారా… చూద్దాం.. ఏం జరుగుతుందో..!

- Advertisement -