గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సినీ నటి కుష్బూ

324
Khushbu

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ లో కార్యక్రమం ఉద్యమంలా సాగుతుంది. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సినీ హీరో అర్జున్ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు సినీ నటి కుష్బూ. ఈసందర్బంగా బంజారాహిల్స్ రాజుబీఎన్ఆర్ కాలనీలోని మున్సిపల్ పార్క్‌లో మొక్కలు నాటారు.

ఈకార్యక్రమంలో ఏపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, గ్రీన్‌ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, పురుషోత్తంలు పాల్గోన్నారు. మొక్కలు నాటడం మంచి కార్యక్రమం అన్నారు కుష్బూ.  ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా మంచి ఆలోచన..అందరూ ఇలాగే ఆలోచిస్తే పర్యావరణానికి మేలు చేసిన వాళ్లమవుతామన్నారు. భవిష్యత్ తరాలకు మంచి జీవితం అందించే బాధ్యత మనపై ఉందన్నారు.

Roja khushbu