వేదికపైనే కాజల్ బుగ్గపై ముద్దు పెట్టాడు..!

558
Kajal Agarwal
- Advertisement -

ఒక్కోసారి ఊహించనివి జరుగుతుంటాయి. ఆవేశంలోనో.. ఆనందంలోనే .. ఉద్వేగంలోనో.. ఉల్లాసంలోనో అనుకోని విధంగా అవతలి వారిపై ప్రేమ పుట్టుకొచ్చేస్తుంటుంది. ఆ ప్రేమ కాస్తా లటుక్కున ఛుమ్మాగా మారితేనే కాస్తంత షాకింగ్ సర్ ప్రైజ్ ఆడియెన్ కి దొరుకుతుంది. అలాంటి సర్ ప్రైజ్ నే ఇచ్చాడు సీనియర్ ఛాయాగ్రాహకుడు చోటా.కె.నాయుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కవచం’. శ్రీనివాస్ మామిళ్ల ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సోమవారం ఈ సినిమా టీజర్ విడుదలైంది. కాగా, టీజర్ విడుదల సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది.

Kajal Agarwal

కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు తనకు ఇష్టమైన వ్యక్తి అని పేర్కొంటూ ఆయనను ‘స్మాల్’ అని సంబోధించింది. ఆయనతో మరోసారి కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతని పేర్కొంది. దీంతో ఆనందం పట్టలేని చోటా కె. నాయుడు వెంటనే కాజల్‌ను దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దు పెట్టాడు. ముందు షాకై తర్వాత తేరుకుని ‘చాన్స్ పే డ్యాన్స్’ అని నవ్వేసింది. ‘స్మాల్ ఇట్స్ ఫైన్. ఆయన నా కుటుంబంలోని ఓ వ్యక్తి లాంటి వారు’’ అని వాతావరణాన్ని తేలికపరిచింది.

- Advertisement -