కోమటిరెడ్డి అసత్య ప్రచారం మానాలి: చిరుమర్తి

436
chirumarthi lingaiah

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యా. బ్రహ్మాణ వెళ్ళాంల ప్రాజెక్టు పనులను తొందర్లనే పూర్తి చేసి చెరువులు నింపుతామని..కోమటిరెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు. నల్గొండలో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన లింగయ్య……కోమటిరెడ్డి ఆరోపణలను ఖండించారు.

సాగు నీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేసి కోటి ఎకరాలకు నిరందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యం……….రాజకీయాల్లో వ్యకిగత విమర్శలు సరికాదన్నారు. టీఆర్ఎస్ నేతలను రాళ్లతో కొట్టండి అనడాన్ని కోమటిరెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.

కోమటిరెడ్డి కి మతి భ్రమించిందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.నల్గొండ నియోజకవర్గ ప్రజలు ఛీకొట్టిన కోమటిరెడ్డికి ఇంకా బుద్ధి రావడం లేదన్నారు.ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడపడమే కోమటిరెడ్డికి అలవాటన్నారు.

బ్రహ్మాణ వెళ్ళాంల ప్రాజెక్టులో సాంకేతికంగా సమసస్యలు తలెత్తడంతో పనులు కొంత మందకొడిగా సాగుతున్నాయని….సీఎం కేసీఆర్ పై ఆరోపణలు చేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ ను జిల్లా నుంచి తరిమికొడతామన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించి సీఎం కేసీఆర్ దేశం యావత్తును అశ్చర్యపరిచారు…మంత్రి జగదీష్ నాయకత్వం లో నల్గొండ జిల్లా అభివృద్ధి లో ముందంజలో ఉందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత బ్రహ్మాణ వెళ్ళాంల ప్రాజెక్టులో భూ నిర్వాసితులకు 10 కోట్లు చెల్లించామన్నారు.