ఘనంగా సినీ మహోత్సవం…

422
cine rajithothsavam

తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ (టిసిపిఈయూ) స్థాపించి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా తెలుగు సినీ రథసారథుల రజతోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో టాలీవుడ్ అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరుగగా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, కె. రాఘవేంద్రరావు, మహేష్ బాబు, జయసుధ, జయప్రద, సుహాసిని, సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, రకుల్, అనసూయ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి… సినిమా సక్సెస్ కోసం ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు ఎంత కష్టపడతారు, ఎంత శ్రమిస్తారు అనేది తాను చేశానని… సినిమా ఆఫీస్ తీసినప్పటి నుండి అది విడుదల అయ్యే వరకు శ్రమించేది మేనేజర్లేనని చెప్పారు.

సినిమా అనే అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునదిరాళ్లు. షూటింగ్ జరుగుతున్న సమయంలో తక్కువ నిద్రపోయేది మేనేజర్లు కావున సినిమా సక్సెస్ లో వారి పాత్ర చాలా ఉందన్నారు. అందుకే ఈ ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి అందరూ స్వచ్చందంగా వచ్చామని చెప్పారు.

ఈ మధ్య కాలంలో ఇంత గొప్ప ఫంక్షన్ చూడలేదు. మేనేజర్లు చేస్తున్న ఈ ఫంక్షన్ పెద్ద సక్సెస్ దిశగా ముందుకు వెళుతుందన్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తాను ఇన్ని గొప్ప సినిమాలు చేయడానికి సహకరించిన అందరూ మేనేజర్స్ కు థాంక్స్ తెలుపుతున్నాను అన్నారు.

ఈ ఫంక్షన్ లో చిరంజీవి గారిని కలవడం కొత్త ఎనర్జిని ఇచ్చిందన్నారు ప్రిన్స్ మహేష్ బాబు. మేనేజర్స్ చేస్తున్న ఈ ఈవెంట్ కు రావడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. భవిషత్తులో వారు మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుంటున్న అన్నారు.