చిరు చిన్నల్లుడికి వేధింపులు…

173
kalyan dev

సెలబ్రెటీలకు సైతం సైబర్ నేరగాళ్ల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌కు సైబర్ వేధింపులు మొదలయ్యాయి. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై,తన కుటుంబసభ్యులపై ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకరమైన కామెంట్స్‌ చేస్తున్నారని కళ్యాణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్యాణ్ దేవ్‌ ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

కళ్యాణ్ ని వేధిస్తున్న వారిలో 10 మందిని గుర్తించారు పోలీసులు.త్వరలోనే వారి పట్టుకొని చర్యలు తీసుకుంటామని సైబర్‌ క్రైమ్‌ అడిషనల్‌ డీసీపీ రఘువీర్‌ మీడియాకు తెలిపారు.

చిరు చిన్న బిడ్డ శ్రీజను వివాహం చేసుకున్నారు కళ్యాణ్ దేవ్. 2018 క్రిస్మస్ రోజున పాపకు జన్మనిచ్చారు. విజేత సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన కళ్యాణ్ దేవ్‌ త్వరలో సెకండ్ మూవీని అనౌన్స్ చేయనున్నారు.