చిరు సంచలన నిర్ణయం..!

263
chiranjeevi congress
- Advertisement -

ఎన్నికల వేళ మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు తనను కేంద్రమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ..మరోవైపు జనసేన నుండి మెగా బ్రదర్స్ ఇద్దరు రంగంలో ఉండటంతో చిరు ఎవరి తరపున ప్రచారం చేస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచేశారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఇటు కాంగ్రెస్‌కు అటు మెగా ఫ్యాన్స్‌కు షాక్‌ ఇచ్చారు చిరు.

రెంటికి చెడ్డ రెవడీలా మారకుండా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఎన్నికలయ్యేంత వరకు కుటుంబసభ్యులతో కలిసి దాదాపు 15 రోజుల పాటు చిరంజీవి విదేశీ పర్యటనకు వెళ్తున్నట్లు సమాచారం.

ఎందుకంటే కొంతకాలంగా క్రీయాశీలరాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవిని తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించింది కాంగ్రెస్‌. దీంతో ఇరకాటంలో పడ్డారు చిరు. తనకు రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీ ఓ వైపు మరోవైపు ప్రాణానికి ప్రాణమైన తమ్ముళ్లు. దీంతో ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మరింది చిరు పరిస్థితి.

ఈ టైంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేసిన చిరు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎవరికీ ప్రచారం చెయ్యకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్రాన్ని విడిచిపెట్టి విదేశాలకు వెళ్ళేందుకు రెడీ అయ్యారు. చిరు నిర్ణయంతో మెగా ఫ్యాన్స్‌ నిరాశలో మునిగిపోయారు.

చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించిన సమయంలో పవన్,నాగబాబు ఇద్దరు విస్తృత ప్రచారం చేశారు. దీంతో జనసేనకు చిరు ప్రచారం చేయడం ఖాయమేనని అంతా భావించారు. కానీ చిరు ఇటు కాంగ్రెస్‌కు అటు మెగా బ్రదర్స్‌కు సమదూరం పాటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట. మరి చిరు తీసుకున్న నిర్ణయంపై మెగా ఫ్యాన్స్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -