చిరు 152లో నయన్ కాదు ఐష్‌….?

198
aishwarya rai chiru

ఖైదీ నెంబర్ 150 తర్వాత చిరంజీవి నటిస్తున్న చిత్ర సైరా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తుండగా చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత చిరు…కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో ఓ సెట్‌ని వేస్తుండగా త్వరలో తొలి షెడ్యూల్ మొదలుకానుంది. ఈ మూవీలో చిరు ద్విపాత్రాభియనం చేస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ మూవీలో చిరుతో సైరా మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్న నయనతారను తొలుత ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో బ్యూటీ పేరు వినిపిస్తోంది. తన అంద,చందాలతో వెండితెరను షేక్‌ చేసిన ఐశ్వర్య రాయ్‌…చిరుతో జోడి కట్టనుందట.

చిరు పక్కన ఎప్పుడూ చూడని నటిని ఎంపికచేసుకుంటే సినిమాకు ఫ్రెష్‌లుక్‌ వస్తుందని చిత్రయూనిట్ భావిస్తుందట. త్వరలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. 2020 వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.