“సైరా” ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

384
syera

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమా తెరకెక్కింది. సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈసనిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈచిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించింది. మరోవైపు బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్..సైరా నరసింహారెడ్డి గురువైన గోసాయి వెంకన్న పాత్రలో నటించాడు.

ఇంకోవైపు సుదీప్, విజయ్ సేతుపతి,జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా చిరంజీవి కేవలం 20రోజుల్లోనే తన డబ్బింగ్ ను పూర్తి చేశారు. అక్టోబర్ 2న ఈమూవీ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. ఈసందర్భంగా త్వరలోనే ఈమూవీ ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నారు. మరోవైపు ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 15న కర్నూలులో నిర్వహించనున్నట్లు సమాచారం.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసింది కర్నూలులో కాబట్టి.. ఇక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే బాగుంటుందని మెగాస్టార్ చిరంజీవితో పాటు చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ వేడుకకు అమితాబ్ బచ్చన్‌తో పాటు రజినీకాంత్, మోహన్ లాల్‌ను ముఖ్యఅతిథిలుగా హాజరు కానున్నట్టు సమాచారం.ఈ రకంగా ఈ సినిమాపై అన్ని భాషల్లో అంచనాలు పెరిగేలా చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఈచిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈమూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.