“సైరా” బంపర్ ఆఫర్.. ఒక టికెట్ కొంటె మరోకటి ఫ్రీ

206
SyeRaa

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సైరా. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ దర్శకుడు సురెందర్ రెడ్డి ఈచిత్రానికి దర్శకత్వం వహించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు.

అయితే అమెరికాలో మాత్రం ఒక రోజు ముందుగానే ఈసినిమా థియేటర్లకు రానుంది. అమెరికాలో మెగా అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు యూస్ డిస్ట్రీబ్యూటర్లు. ఒక టికెట్ కొనుక్కుంటే మరో టికెట్ ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఇలా ఫ్రీగా ఇవ్వడానికి ఒక కారణం కూడా ఉంది.

అక్టోబర్ 2న ఇండియాలో సెలవు దినం కాబట్టి పెద్దగా సినిమా కలెక్షన్లకు ఇబ్బంది ఉండదు. అయితే అమెరికాలో అక్టోబర్ 1న మంగళ వారం వర్కింగ్ డే కావడంతో అక్కడి సినిమా ప్రేక్షక్షులను అట్రాక్ట్ చేసేందుకు ఈనిర్ణయం తీసుకున్నారు డిస్ట్రీబ్యూటర్లు. అమెరికాలో ఏటీ అండ్ టీ సంస్థ ‘సైరా’ టికెట్లను ఆన్ లైన్లో విక్రయిస్తోంది.