చిరంజీవి “సైరా” మేకింగ్ వీడియో

230
syera

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సైరా సినిమా తెరకెక్కుతుంది. చిరంజీవి 151వ సినిమాగా తెరకెక్కుతున్న ఈమూవీలో హీరోయిన్ గా నయనతార నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే నుంచి మరో వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్

. ఈనెల 14న అంటే రేపు సైరా మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రేపు మధ్యాహ్నం 3గంటల 45 నిమిషాలకి ఈ మేకింగ్ వీడియోను విడుదల చేయనున్నారు. ఈసందర్భంగా మేకింగ్ వీడియో విడుదలకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు .

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతన్న ఈమూవీలో తమిళ్ హీరో విజయ్ సేతుపతి, తమన్నా, బిగ్ బి అమితాబ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈమూవీని అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈమూవీపై భారీ అంచనాలున్నాయి.