చిత్రలహరికి చిరు ఫిదా…

164
chitralahari

కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్,కల్యాణి ప్రియదర్శన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘చిత్రలహరి’ .వరుసగా ఆరు ఫ్లాప్‌ల తర్వాత తేజు హై ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య ప్రేక్షకుల ముందుకురాగా ఆ నమ్మకాన్ని నిలబెడుతూ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

విడుదలైన ప్రతీ చోటా మంచి వసూళ్లను రాబడుతుండగా తాజాగా సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి చిత్రయూనిట్‌పై ప్రశంసలు గుప్పించారు.చిత్రలహరి బాగుంది…సినిమాను కిషోర్ తిరుమల ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించారని కొనియాడారు.

ఎలాంటి అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలనే సందేశాన్ని ఇచ్చారని చెప్పారు. ఇక తేజు నటనలో మంచి పరిణతి కనిపించిందని పోసాని కృష్ణమురళి,సునీల్ చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలైట్ అని చిత్రలహరి సినిమాతో మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చిత్రలహరి తొలిరోజు రూ.3.08కోట్ల షేర్ రాబట్టగా వీకెండ్‌లో ఈ కలెక్షన్లు మరింతగా పెరిగాయి.తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రూ.11.50కోట్ల రాబట్టింది చిత్రలహరి.