నక్సలైట్ గా చిరంజీవి..న్యూ లుక్ అదుర్స్

189
megastar

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని కోకాపేటలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈమూవీ షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈమూవీలో చిరంజివి లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షూటింగ్ స్పాట్ లో తీసిన ఈలుక్ లో చిరంజీవి నక్సలైట్ గా కనిపిస్తున్నారు. నక్సలైట్ గెటప్‌‌లో మెడలో ఎర్ర కండువా వేసుకుని నిల్చున్న మెగాస్టార్ లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్..

షూటింగ్ ఫోటోలు బయటకు రాకుండా చిత్రయూనిట్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. ఈమూవీకి ఆచార్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు చిత్రయూనిట్. ఈసినిమాలో ఆలయ ఉద్యోగి పాత్రలో చిరంజీవి కనిపించనున్నాడని తెలుస్తుంది. చిరంజీవి సరసన త్రిష నటించనుండగా రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ , మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.