కేరళ అడవుల్లో పోరాడుతున్న చిరు..

41
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న సినిమా సైరా. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈచిత్రాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స్వాతంత్ర స‌మ‌ర‌యోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ ఆధారంగా ఈసినిమాను తెర‌కెక్కిస్తున్నారు. చిరు స‌ర‌స‌న క‌థ‌నాయికగా న‌య‌న‌తార న‌టించ‌గా, ముఖ్య‌మైన పాత్ర‌లో త‌మ‌న్నా న‌టిస్తుంది. త‌మిళ హీరో విజ‌య్ సేతుప‌తి, బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ప‌లువురు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Chiranjeevi

ప్రస్తుతం ఈ మూవీ కేరళలో షూటింగు జరుపుకుంటోంది. చిరంజీవి .. తదితరులపై కేరళలోని దట్టమైన అడవుల్లో, భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 10 రోజుల పాటు అక్కడ పోరాట సన్నివేశాలనే చిత్రీకరిస్తారు.

ఈ షెడ్యూల్‌ తర్వాత హైదరాబాద్‌లో మరో షెడ్యూల్ షూటింగు జరగనుంది. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది. ఆ తరువాత వీఎఫెక్స్ పూర్తికావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.