బాహుబలి లేకపోతే సైరా లేదుః చిరంజీవి

224
chiranjeevi-jpg_

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురెందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం సైరా. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా ఈసినిమా తెరకెక్కింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈసినిమాలో బిగ్ బి అమితాబ్ కీలక చిరంజీవి గురవు పాత్రలో నటించారు. నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ట్రైలర్ కు భారీగా స్పందన వస్తోంది.

తాజాగా హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈచిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. దర్శకుడు సురెందర్ రెడ్డి ఈసినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. రాబోయే తరానికి చరిత్ర తెలియజేసేందుకు ఈసినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు.

ఇలాంటి సినిమాలను నిర్మించడానికి చాలా ధైర్యం కావాలి.. రామ్ చరణ్ చాలా ధైర్యం చేసి సినిమాను నిర్మించాడు. ఈసినిమా చేయాలనే ఆలోచన రావాడానికి ముఖ్య కారణం దర్శకుడు రాజమౌళి. ఈసినిమాకు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేశారు. ఇవాళ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి లేకపోతే సైరా సినిమా లేదని చెప్పారు. బాహుబలి అంత పెద్ద విజయం సాధించింది కాబట్టే అదే ధైర్యంతో ఈసినిమా చేయగలిగామని చెప్పారు. రాజమౌళి మన తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారన్నారు.