అర్జున్ సురవరం..అతిథిగా చిరంజీవి

546
arjun suravaram
- Advertisement -

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్ పి అండ్ ఔరా ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. పతాకాలపై టి. ఎన్. సంతోష్ దర్శకత్వంలో రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం “అర్జున్ సురవరం”.

నవంబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈ నెల 26(రేపు) హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. నెక్లెస్‌ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభంకానుంది.ఈ ఈవెంట్‌కు అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు.

సినిమా షూటింగ్ పూర్తై నెలలు గడుస్తోంది. అయితే అనివార్య కారణాల వల్ల విడుదల ఆలస్యం కాగా ఎట్టకేలకు రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకుని ప్రేక్షకుల ముందుకురావడానికి సిద్ధంగా ఉంది. నిఖిల్ హీరోగా ఇది 16వ చిత్రం.

The Grand #ArjunSuravaramPreRelease Event tomorrow from 5 PM onwards!!#MegastarChiranjeevi gaaru gracing the event. Chiranjeevi

- Advertisement -