లాక్ డౌన్… ఇదే నా డ్యూటీ.. : చిరంజీవి

149
chiranjeevi

సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రో అప్ డేట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఉగాది సంద‌ర్భంగా సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు…ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ ఇస్తున్నారు.

కొద్ది సేప‌టి క్రితం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశారు చిరంజీవి. ఈ ఫోటోలో త‌న ఇంట్లోని మొక్క‌ల‌కి నీళ్లు ప‌డుతున్న‌ట్టు క‌నిపించాడు. దీనికి మొక్కే క‌దా అని వ‌దిలేస్తే.. అని ఇంద్ర సినిమాలోని ఫేమ‌స్ డైలాగ్‌ని జ‌త చేశాడు.

ప్ర‌తి రోజు ఇదే నా డ్యూటీ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చారు చిరు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా కార‌ణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా ప‌డింది.