చిరు ‘ఆచార్య’ ఫ‌స్ట్ లుక్ తేదీ ఖ‌రారు!

287
chiranjeevi
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే సినిమాలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈమూవీ షూటింగ్ స‌గం వ‌ర‌కు పూర్తి చేసుకుంది. చిరు స‌ర‌స‌న కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేక పాత్ర‌లో న‌టించ‌నున్నారు. చ‌ర‌ణ్ అర‌గంట పాటు ఈమూవీలో క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇందులో చిరు దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

ఈమూవీలో చిరు లుక్ ఇటివ‌లే లీక్ అయిన సంగ‌తి తెలిసిందే. న‌క్స‌లైట్ గెట‌ప్ లో చిరు ద‌ర్శ‌న‌మిచ్చారు. కాగా తాజాగా ఉన్న స‌మాచారం మేర‌కు ఆచార్య మూవీ ఫ‌స్ట్ లుక్ ను శ్రీరామ్ న‌వ‌మి రోజున విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. ఈవిష‌యానికి సంబంధించి చిత్ర‌యూనిట్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈసినిమాను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. ద‌స‌రాకు ఈమూవీని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు చిత్ర‌యూనిట్.

- Advertisement -